బీఆర్ఎస్ నేత రాజవరప్రసాద్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులుపై చేసిన వ్యక్తిగత విమర్శలను టీఎంఆర్‌పీఎస్ రాష్ట్ర నాయకుడు సింగపాక జంగయ్య తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలు చేయవచ్చని, కానీ ఒక దళిత బిడ్డపై వయస్సుతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం సహించరానిదని ఆయన హెచ్చరించారు. రాజవరప్రసాద్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేదంటే సమాజం చూస్తూ ఊరుకోదని ఆగ్రహం వ్యక్తం చేశారు.