షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన 18వ భాగ్యనగర్ కాలనీలో పర్యటించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని, సమస్యాత్మక ప్రాంతాల్లో తక్షణ పరిష్కార చర్యలు చేపడతామని పేర్కొన్నారు.