షాదనగర్ పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత

0చూసినవారు
షాదనగర్ పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత
షాదనగర్ పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క బంకులోనూ పెట్రోల్ అందుబాటులో లేకపోవడంతో, నో స్టాక్ బోర్డులు కూడా ఏర్పాటు చేయకుండా తాత్కాలికంగా తాళ్లు కట్టి వదిలేశారు. పెట్రోల్ కొరతకు కారణం ఏమిటో తెలియక, పెట్రోల్ దొరకకపోతే పరిస్థితి ఏంటోనని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా పెట్రోల్ బంద్ చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కొందరు వాహనదారులు పెట్రోల్ అయిపోవడంతో అక్కడే వాహనాలను వదిలి నడిచి వెళ్లాల్సి వచ్చింది.