అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలతో చెలగాటం

0చూసినవారు
అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలతో చెలగాటం
షాద్ నగర్ పట్టణంలో సోమవారం, పరిమితికి మించి విద్యార్థులను కూర్చోబెట్టుకొని ప్రయాణిస్తున్న ఆటోలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పాఠశాల సమయాల్లో 15-20 మంది విద్యార్థులతో నిండిన ఆటోలు పట్టణ రోడ్లపై దూసుకుపోతున్నాయి. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. విద్యార్థుల భద్రత పట్ల కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్