షాద్‌నగర్ పోలీసులు క్రైమ్ నంబర్ 335/2026 కేసులో కీలక పురోగతి సాధించి, నిందితుడిని అరెస్టు చేసి, దొంగిలించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదుదారుడు లింగారం నరేశ్ 18.04.2026న హైదరాబాదు నుండి ఇంటికి తిరిగి వస్తూ షాద్‌నగర్ బస్ స్టాండ్ వద్ద దిగారు. అప్పుడు ఒక అపరిచితుడు 'డిస్ట్రిబ్యూటర్ జాబ్' పేరుతో నమ్మించి, సంగమేశ్వర లాడ్జ్ లోని రూమ్ నంబర్ 107కి తీసుకెళ్లాడు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.