జిల్లాలోని జిల్లేడు చౌదరిగుడా మండలం ఎల్క గూడెం సర్పంచ్ బందయ్యపై అగ్రకులానికి చెందిన రామిరెడ్డి, అతని అనుచరులు దాడికి పాల్పడడాన్ని పలువురు సర్పంచులు తీవ్రంగా ఖండించారు. తమకు సంబంధించిన అభ్యర్థి గెలవలేదనే అక్కసుతో ఒక సర్పంచ్‌పై హత్యాయత్నానికి పాల్పడే స్థాయికి దిగజారడం అత్యంత దారుణమని రాయికల్ సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్, అన్నారం సర్పంచ్ లావణ్య రామకృష్ణ, రామేశ్వరం సర్పంచ్ మానస సురేష్, ఎలికట్ట సర్పంచ్ రాణి నరసింహ, దేవునిపల్లి సర్పంచ్ లలిత మల్లేష్ లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు కఠిన శిక్షలు విధించాలని వారు డిమాండ్ చేశారు.