షాద్‌నగర్ 26వ వార్డు ప్రజలు పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో నిర్వహించిన వార్డు సభలో కౌన్సిలర్ ఎస్పీ శివ నేతృత్వంలో ప్రజలు తమ సమస్యలను వెలుగులోకి తెచ్చారు. అభివృద్ధి గురించి రోజు చెబుతున్నా, తాము అవస్థలు పడుతున్నామని, తమ సమస్యల పట్ల పాలకులకు పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదని, వాటిపై దృష్టి సారించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.