పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మకు వినతి

3చూసినవారు
పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మకు వినతి
షాద్‌నగర్ ముఖ్య కూడలి విస్తరణకు సహకరించాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మకు బీజేపీ యువ నాయకులు అడ్వకేట్ కాసోజు శివ వినతి పత్రం అందించారు. రోజురోజుకి పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా, ఇరుకైన రోడ్డు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సిగ్నల్స్ పడినప్పుడు వాహనాలు కదలలేక ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నప్పటికీ, షాద్‌నగర్ ముఖ్య కూడలిని విస్తరించకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్