మారుమోగిన సేవాలాల్ మహారాజ్ గిరిజనుల శోభాయాత్ర ర్యాలి

1చూసినవారు
మారుమోగిన సేవాలాల్ మహారాజ్ గిరిజనుల శోభాయాత్ర ర్యాలి
షాద్‌నగర్ పట్టణంలో సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా గిరిజనులు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో గిరిజనులు సంప్రదాయ వేషధారణలో పాల్గొని తమ సంస్కృతి, ఆచార సంప్రదాయాలను చాటిచెప్పారు. డప్పులు, నృత్యాలు, భక్తి గీతాలతో పట్టణం మారుమోగింది. సేవాలాల్ మహారాజ్ ఆశయాలను స్మరించుకుంటూ యువత ఉత్సాహంగా పాల్గొనడం విశేషం.