షాద్‌నగర్, ఆదివారం: గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ శైలజ విద్యార్థుల పట్ల వేధింపులకు పాల్పడుతున్నారని, అనైతికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, వంట సరుకులు దొంగిలిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ విజయకుమార్ ఆదివారం కళాశాల భవనానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. అధికారులు విద్యార్థులతో పాటు సిబ్బందితోనూ మాట్లాడి వాస్తవాలను విచారించారు.