షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, దర్గాలు మతాల ఐక్యతను చాటుతూ అందరినీ ఆధ్యాత్మికత వైపు నడిపిస్తాయని అన్నారు. ఉప్పరిగడ్డ సర్పంచ్ చందు నాయక్ ఆధ్వర్యంలో దర్గాలో జరిగిన ఉర్సూ ఉత్సవాలలో పాల్గొన్న ఆయన, ఉత్సవాల ద్వారా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఇద్రీస్, చించోడు అనంతం తదితరులు పాల్గొన్నారు.