బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన షాద్ నగర్ ఎమ్మెల్యే

0చూసినవారు
బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన షాద్ నగర్ ఎమ్మెల్యే
ఖమ్మం జిల్లా రాపర్తి నగర్‌లో 2026 జూన్ 6న జరిగిన దారుణ ఘటనలో, 49 ఏళ్ల మహమ్మద్ గౌస్ అనే డ్రైవర్ 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసి, అపార్ట్‌మెంట్ పైకప్పు నుంచి కిందకు తోసేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పరామర్శించారు. బాధితురాలికి తక్షణ సహాయంగా రూ. 50,000 అందించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ పరంగా అన్ని సహాయాలు అందిస్తామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాలిక తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్