ఉపాధ్యాయులను చైతన్యపరిచే కోఆర్డినేటర్ గా జిల్లా వ్యాప్తంగా పేరు ఉన్న హిందీ పండిత్ అనురాధ శనివారం రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. నందిగామ మండలంలోని నర్సప్పగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈమె ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ దార్ల రాఘవేంద్ర చారి ఎన్నికయ్యారు. ఈయన ఫరూక్ నగర్ ఉర్దూ మీడియంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.