షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం చింతకుంటపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 98 లో పలుగు దగ్గర ప్రభుత్వ భూమి ఫెన్సింగ్ వేశారని గురువారం గ్రామస్తులు ఫిర్యాదు చేసి వాట్సప్ గ్రూపులలో వైరల్ చేసారు. హుటాహుటిన స్పందించిన అధికారులు అధికారుల తీరు భేష్. అధికారులు అంటే ఇలా ఉండాలి అనే విధంగా స్పందించారని పలువురు అభినందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి ఫెన్సింగ్ ని తొలగించారు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెన్నకేశవులు హెచ్చరించారు.