షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణ ముందు ఆరుగురి మహనీయుల విగ్రహాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేసి ఐదు నెలలు గడిచిపోయాయి. అయినా నేటికీ ఆ విగ్రహాలు ప్రారంభానికి నోచుకోలేకపోయాయి. ఈ ఐదు నెలల కాలంలో ఆ విగ్రహాలకు కట్టిన ముసుగు కవర్లు పదే పదే చినిగిపోయి స్వతహాగా ఆవిష్కరణ జరిగిపోతున్నాయి. అధికారులు స్పందిస్తారో. ప్రజాప్రతినిధులు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.