షాద్‌నగర్ పట్టణంలోని హాజిపల్లి రోడ్డు విజయనగర్ కాలనీ శ్రీ వీరాంజనేయ సహస్ర లింగేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు విశ్రాంత ఎంపీడీవో, దాత దండు శరత్ చంద్రబాబు, వ్యాపారి, దాత దండు శ్రీనివాస్ (వాసు) శనివారం ఆర్థిక సహకారం అందించారు. దేవాలయ ప్రాంగణంలో చేపట్టిన పనులు, ఇతర సామాగ్రి నిమిత్తం దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు రూ. 51 వేల రూపాయలు ఇచ్చారు.