రంగారెడ్డి జిల్లా తెలంగాణ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు ఏ శ్రీనివాస్ రెడ్డి, ఉద్యమకారులు సుధాకర్, రవికుమార్ గౌడ్, రాజు, మేకల వెంకటేష్, సునీల్ రెడ్డి, శేఖర్ గౌడ్, నరసింహ, శంకర్ గౌడ్ తదితరులు సోమవారం తెలంగాణ ఉద్యమకారుల అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు ప్రభుత్వ ఆదేశాలతో ఉద్యమకారులను అరెస్టు చేయడం సహించబోమని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉద్యమకారులను అనవసరంగా అరెస్టు చేయడం తగదని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.