రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులో ఉన్న నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రిన్సిపల్ అక్రమాలు, వేధింపులకు నిరసనగా ఆదివారం మెరుపు ధర్నా చేపట్టారు. కళాశాల భవనం నుండి రోడ్లపైకి వచ్చిన విద్యార్థినులు పట్టణ చౌరస్తాలో ఆందోళన చేస్తున్న సమయంలో, పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ విద్యార్థినిపై చేయి చేసుకోవడంతో, ఆగ్రహించిన విద్యార్థినులు ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చి చితకబాదారు.