కొత్త రోడ్డు వేశారు... స్పీడ్ బ్రేకర్లు మరిచారు..

0చూసినవారు
కొత్త రోడ్డు వేశారు... స్పీడ్ బ్రేకర్లు మరిచారు..
షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో మూడు నెలల క్రితం రామకృష్ణ థియేటర్ నుంచి కుంట బడి మీదుగా పాత జాతీయ రహదారి వరకు నూతనంగా సీసీ రోడ్డు వేశారు. విస్తరించిన ఈ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు వేయడం అధికారులు మరిచిపోయారు. పలు కాలనీల రోడ్లు, బైపాస్ రోడ్డుగా ఉపయోగపడుతున్న ఈ మార్గంలో వందలాది వాహనాలు వేగంగా వెళ్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్