షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటరమణ కాలనీలో విద్యుత్ తీగలు తగిలి మూడు గేదెలు, ఒక ఆవు మృతి చెందాయి. మూడు రోజుల క్రితం మేత మేయడానికి వెళ్లిన ఈ పశువులు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు గురై అక్కడికక్కడే మరణించాయి. తెగిన విద్యుత్ వైరు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికుడు శరత్ కృష్ణ తెలిపారు. మూడు రోజులుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో దుర్వాసన వస్తుందని, మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.