షాద్‌నగర్ టిఎన్జీవో ప్రెసిడెంట్‌గా ఎన్నికైన శ్రీనివాస్‌ను చించోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, ఆరోగ్య సిబ్బంది ఘనంగా సన్మానించారు. తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి తాలూకా టిఎన్జీవో ప్రెసిడెంట్‌గా ఎంపికైన శ్రీనివాస్‌పై తాము గర్వపడుతున్నామని సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, హెల్త్ సూపర్వైజర్ శ్రీరామ్, ల్యాబ్ టెక్నీషియన్ అశోక్, స్టాఫ్ నర్స్ వినీత, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.