షాద్‌నగర్‌లో గ్రామ సింహాల పోరు.. భయాందోళనలో ప్రజానీకం

0చూసినవారు
షాద్‌నగర్‌లో గ్రామ సింహాల పోరు.. భయాందోళనలో ప్రజానీకం
షాద్‌నగర్ పట్టణ పరిధిలోని బుచ్చీగూడ రోడ్డు, కేశంపేట్ రోడ్ బైపాస్ ప్రాంతాల్లో వీధి కుక్కలు రెచ్చిపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పగటిపూట రోడ్లపై అడ్డంగా ఉంటూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాత్రివేళల్లో ప్రయాణికులను వెంటాడి కరవడం, పిల్లలపై దాడులు చేయడం, కాలనీల్లో అరుపులతో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఈ సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు గురువారం మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్