షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం దేవునిబండ తండాలో ఏడవ వార్డు సభ్యునిగా సమంత ఈశ్వర్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం రిటర్నింగ్ అధికారి ద్వారా సర్పంచ్ అభ్యర్థి కేతావత్ మోహన్ ఆధ్వర్యంలో నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా సమంత ఈశ్వర్ నాయక్ మాట్లాడుతూ, దేవునిబండ తండా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కేతావత్ మోహన్‌కు ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి, గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.