ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, షాద్ నగర్ మున్సిపాలిటీ 27వ వార్డులోని న్యూసిటీ కాలనీలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, కౌన్సిలర్ మురళీమోహన్ పర్యటించారు. కాలనీవాసులు తమ సమస్యలను చైర్మన్‌కు వివరించారు. వెంటనే పరిష్కరిస్తానని చైర్మన్ బసవేశ్వర్ హామీ ఇచ్చారు. దశలవారీగా సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.