పరూక్ నగర్ మండలం జోగమ్మగూడ గ్రామ శివారులోని చెరువులో శనివారం సాయంత్రం రాహుల్ (23) అనే యువకుడు చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. కొందుర్గు మండలం కాస్లాబాద్ గ్రామానికి చెందిన రాహుల్, తన తాతయ్య దినకర్మల కోసం రామే శ్వరం తండాకు వచ్చాడు. చెరువులో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు, అతడి బంధువులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి కోసం గాలించి, రాత్రి 8.30 గంటల సమయంలో మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.