జోగమ్మగూడ చెరువులో యువకుడు గల్లంతు

598చూసినవారు
జోగమ్మగూడ చెరువులో యువకుడు గల్లంతు
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూక్‌నగర్ మండలం జోగమ్మగూడ గ్రామంలో 23 ఏళ్ల యువకుడు రాహుల్ గ్రామ చెరువులో గల్లంతయ్యాడు. సాయంత్రం చెరువులో పడిపోయిన రాహుల్ నీటిలో మునిగిపోయినట్లు సమాచారం. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. రాహుల్ మృతదేహం కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు చెరువు వద్ద ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్