సికింద్రాబాద్ - సంజీవ రెడ్డి నగర్ దాసరం బస్తీలో ఉద్రిక్తత

1625చూసినవారు
సికింద్రాబాద్‌లోని సంజీవ రెడ్డి నగర్ దాసరం బస్తీలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. నాలుగు ఎకరాల స్థలంలో నిర్మాణానికి యత్నించిన ఓ బిల్డర్, బస్తీ వాసులకు దారి లేకుండా చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనికి ప్రతిగా, బిల్డర్ పాత బస్తీ బౌన్సర్లను రంగంలోకి దింపి బస్తీ వాసులపై రాళ్లతో దాడి చేయించాడని, ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయని తెలిసింది. 35 ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్నామని, ఇక్కడి నుంచి వెళ్లేది లేదని బస్తీ వాసులు తేల్చి చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్