
ప్రతికూల వాతావరణం.. వెనక్కి మళ్లిన మోదీ హెలికాప్టర్
కోల్కతా నుంచి తాహెర్పుర్కు బయల్దేరిన ప్రధాని మోదీ హెలికాప్టర్, దట్టమైన పొగమంచు కారణంగా అక్కడ ల్యాండ్ అవ్వలేకపోయింది. దీంతో కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత, హెలికాప్టర్ తిరిగి కోల్కతాకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన ప్రధాని పర్యటనలో చోటుచేసుకుంది.







































