తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. 15ఏళ్ల బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. నామక్కల్ ప్రభుత్వాసుపత్రిలో మైనర్ ప్రసవించడంతో హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ముదలైపట్టి ప్రాంతానికి చెందిన సతీష్ కుమార్ మెకానిక్ షాపు నడిపిస్తుంటాడు. అతనికి ఓ మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఓ రోజు బాలికను తన ఇంటికి పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. తాజాగా బిడ్డకు జన్మనిచ్చింది. పోలీసులు బాలికను ఈ విషయం గురించి అడగ్గా.. సతీష్ గురించి చెప్పింది.