హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ప్రాంతంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన ఓ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. హోటల్‌లో పనిచేస్తున్న బాలుడు, బాధితురాలు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యారు. ఈ పరిచయం ప్రేమగా మారడంతో పలుమార్లు కలుసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన బాలుడు, తర్వాత ముఖం చాటేశాడు. బాలిక కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.