TG: మెదక్ జిల్లాలో బాలికపై అత్యాచారం కేసులో దోషికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శంకరంపేట (ఎ) మండలంలో 2022లో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో సోమవారం తీర్పు వెలువరించింది. ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి ఒడిగట్టిన థలారి మోహన్ అనే వ్యక్తిని దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి రూ. 3లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.