నటి అభినయ ప్రధాన పాత్రలో నటించిన తాజా మలయాళ చిత్రం ‘పని’. అయితే ఈ మూవీలో హీరోయిన్‌పై చిత్రీకరించిన అత్యాచార సన్నివేశం ఇటీవల వివాదాస్పదమైంది. దీంతో దర్శకుడు జోజూ జార్జ్ మేకింగ్‌ను పలువురు తప్పుపట్టారు. దీనిపై తాజాగా అభినయ స్పందించారు. ‘తన సినిమాలో ఎలాంటి సన్నివేశాలు పెట్టాలి? ఎలా తెరకెక్కించాలి? అనేది పూర్తిగా దర్శకుడి నిర్ణయం. కాబట్టి దాని గురించి నేను పెద్దగా ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు’అని తెలిపారు.