
BRICS సమ్మిట్.. నేటి షెడ్యూల్ ఇదే
న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు-2026 ఆదివారంతో ముగియనుంది. ముగింపు రోజున అంతర్జాతీయ నాయకుల గ్రూప్ ఫోటో అనంతరం, ప్రపంచ ఆర్థిక పురోగతి, ప్రాంతీయ భద్రతపై ఓపెన్ సెషన్లో కీలక చర్చలు జరపనున్నారు. సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించిన అంశాలు, ఆర్థిక ఒప్పందాలు, భవిష్యత్ కార్యాచరణతో కూడిన చారిత్రాత్మక 'ఢిల్లీ డిక్లరేషన్'ను నేడు అధికారికంగా విడుదల చేయనున్నారు. తొలి రోజు విజయాలపై ప్రధాని మోదీ షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.




