మెడికల్‌ చరిత్రలో మిరాకిల్‌.. రెండుసార్లు జన్మించిన అరుదైన శిశువు

7034చూసినవారు
మెడికల్‌ చరిత్రలో మిరాకిల్‌.. రెండుసార్లు జన్మించిన అరుదైన శిశువు
అమెరికాలో వైద్య చరిత్రలోనే అరుదైన సంఘటన చోటుచేసుకుంది. టెక్సాస్‌కు చెందిన మార్గరెట్‌ బోమర్‌ అనే మహిళ కడుపులో పెరుగుతున్న శిశువు వెన్నుముక చివరలో శాక్రోకాక్సిజియల్ టెరాటోమా అనే అరుదైన కణితిని గుర్తించారు. అయితే కవలల్లో ఒకరు గర్భంలోనే చనిపోగా, మిగిలిన శిశువును బతికించుకోవడానికి వైద్యులు 23 వారాల గర్భంలోనే పిండాన్ని బయటకు తీసి, కణితిని తొలగించి, తిరిగి గర్భంలో ప్రవేశపెట్టారు. ఈ అరుదైన శస్త్రచికిత్స విజయవంతమై, 36 వారాల తర్వాత శిశువు ఆరోగ్యంగా జన్మించింది. ఆ శిశువుకు లిన్లీ హూప్‌ అని పేరు పెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్