
గంటకు 40 వేల టికెట్స్.. ‘పెద్ది’ రికార్డు
రిలీజ్‌కు ముందు నుంచే టికెట్ బుకింగ్స్‌లో జోరు చూపిన ‘పెద్ది’ చిత్రం విడుదల అనంతరం కూడా అదే కొనసాగిస్తోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ‘బుక్ మై షో’లో ‘పెద్ది’ సినిమాకు గంటకు 40వేల టికెట్స్ బుక్ అవుతున్నాయి. 2023లో బుక్‌మై షో ప్రవేశపెట్టిన ‘అవర్లీ ట్రెండింగ్’ ఫీచర్ తర్వాత.. ఈ 40 వేల మార్క్‌ను దాటిన చిత్రాల జాబితాలో ఇప్పటివరకు మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి. కల్కి 2898 ఏడీ, సలార్, పుష్ప తర్వాత స్థానంలో ‘పెద్ది’ నిలిచింది. మొదటిరోజే ఈ మార్క్‌ను చేరుకొని రికార్డు సృష్టించింది.




