నటి కీర్తి సురేశ్‌కు అరుదైన గౌరవం

20చూసినవారు
నటి కీర్తి సురేశ్‌కు అరుదైన గౌరవం
ప్రముఖ నటి కీర్తి సురేశ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆమె ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్ ఇండియా విభాగానికి సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమితులయ్యారు. పిల్లల మానసిక ఆరోగ్యం, హక్కుల గురించి ఆమె పనిచేయనున్నారని యునిసెఫ్‌ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ ప్రకటించారు. ఈ బాధ్యతలు చేపట్టడం తనకు గొప్ప గౌరవమని కీర్తి సురేశ్ పేర్కొన్నారు. పిల్లల శ్రేయస్సు, వారి పెంపకం, సంరక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి యూనిసెఫ్ ఇండియాతో కలిసి పనిచేయడం తనకు గౌరవంగా ఉందని ఆమె తెలిపారు.