ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ (హెచ్‌కేఎస్) మార్చిలో నిర్వహించనున్న తొలి ఏఐ సదస్సులో ముఖ్యఅతిథిగా ప్రసంగించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు దేశం నుంచి ఆయన ఒక్కరికే ఆహ్వానం అందింది. హెచ్‌కేఎస్ డీన్ జెరెమీ వీన్‌స్టయిన్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్వాహకులు సీఎంను కోరగా, హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా పాల్గొని ప్రసంగిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఆహ్వానం తెలంగాణకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు.