
భారత పర్యటనలో ట్రంప్ చిన్నల్లుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు మైఖెల్ బౌలోస్ వ్యక్తిగత పర్యటనలో భాగంగా శనివారం కేరళలోని కొచ్చికి చేరుకున్నారు. ఆయనతో పాటు భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఉన్నారు. మైఖెల్ బౌలోస్ అలప్పుళలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. మైఖెల్, రాయబారి సెర్గియో గోర్ దశాబ్ద కాలంగా స్నేహితులని, వారిని కలిసేందుకే ఈ పర్యటన అని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. గత మేలో కూడా మైఖెల్ తన భార్య, ట్రంప్ కుమార్తె టిఫానీతో భారత్లో పర్యటించారు.




