
తిరుమలలో అజిత్.. అలా పిలవద్దు అంటూ రిక్వెస్ట్ (వీడియో)
తమిళ హీరో అజిత్ కుమార్ సోమవారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల అజిత్‌ను చూసిన అభిమానులు ఆయనతో ఫోటోలు దిగడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. అజిత్ కూడా అభిమానుల కోరిక మేరకు సెల్ఫీలు ఇచ్చారు. అయితే, అభిమానులు తలా తలా అంటూ నినాదాలు చేయగా, ఆలయ ప్రాంగణంలో అలాంటి నినాదాలు వద్దని ఆయన సైగలతో సూచించారు.




