ఆసియా క్రికెట్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ రికార్డు

8890చూసినవారు
ఆసియా క్రికెట్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ రికార్డు
అఫ్గానిస్థాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ మరో అరుదైన రికార్డును నమోదు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 200 వన్డే వికెట్లు, 150 టీ20 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్లు తీసిన రషీద్‌, వన్డేల్లో 115 మ్యాచ్‌ల్లోనే 200 వికెట్ల మార్క్‌ దాటాడు. ఐపీఎల్‌లో కూడా 158 వికెట్లు సాధించిన రషీద్‌ ఘనతను అభిమానులు సంబరంగా జరుపుకుంటున్నారు.