
అక్క కొడుకును కాపాడే క్రమంలో కుంటలో మునిగి యువతి మృతి
ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండలోని గాయత్రి నగర్లోని ఒక కుంట వద్ద మేకలు మేపుతున్న మల్లీశ్వరి, ఆమె అక్క కొడుకు శివ నీటిలో పడిపోయారు. శివను కాపాడే ప్రయత్నంలో మల్లీశ్వరి కుంటలో మునిగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు ఆమెను బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మల్లీశ్వరి మృతి చెందింది. శివ ప్రాణాలతో బయటపడ్డాడు. అక్క కొడుకును కాపాడే క్రమంలో యువతి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.




