
ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం శుభవార్త
AP: ఇల్లు నిర్మించుకునే వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పట్టణాల్లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే ఇళ్లకు రూపాయికే అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే 3 మీటర్ల ఎత్తు దాటిన భవన నిర్మాణాల్లో బాల్కనీలను 1.5 మీటర్ల వెడల్పుతో నిర్మించుకునే అవకాశం కల్పించింది. గృహ అవసరాలపై సర్వే చేపట్టగా.. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మందికి ఇళ్లు అవసరం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.




