కన్నడ సినిమా ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలపై నేషనల్ క్రష్ రష్మిక స్పందించింది. తనను ఏ ఇండస్ట్రీ కూడా బ్యాన్ చేయలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పుడు అని స్పష్టం చేసింది. అక్టోబర్ 21న విడుదలకానున్న ఆమె కొత్త సినిమా 'థామా' కన్నడలో రిలీజ్ కాదన్న ప్రచారం నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. కాంతార సినిమాపై స్పందించలేదన్న విమర్శలపై రష్మిక మాట్లాడుతూ, తాను సినిమాలు లేటుగా చూస్తానని, బిజీగా ఉంటానని తెలిపింది.