ఇటీవల వివాహం చేసుకున్న నటుడు విజయ్, రష్మిక మందన్న జంట తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. తాజాగా, పెళ్లికి రెండు రోజుల ముందు జరిగిన సంగీత్ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుటుంబసభ్యులు, ఆత్మీయుల మధ్య సంతోషాలు, భావోద్వేగ క్షణాలు, సర్‌ప్రైజ్‌ల మధ్య ఈ వేడుక ఘనంగా జరిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు. గత నెల 26న రష్మిక-విజయ్ వివాహం ఉదయ్‌పూర్‌లో జరిగింది.