
విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసు
AP: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో నూతన విమాన సర్వీసును నవంబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ సర్వీసు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. విజయవాడ నుంచి నేరుగా సింగపూర్ ఛాంగీ విమానాశ్రయానికి ప్రయాణం చేయవచ్చు. జులైలో సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదన మేరకు 100 రోజుల్లో ఈ సేవ ప్రారంభమైందని మంత్రి తెలిపారు.




