అన్నవరం ప్రసాదం బుట్టల్లో ఎలుకలు

54చూసినవారు
అన్నవరం ప్రసాదం బుట్టల్లో ఎలుకలు
AP: అన్నవరం జాతీయ రహదారిపై సత్యదేవుని నమూనాలయం వద్ద ప్రసాదం ప్యాకెట్లను నిల్వ ఉంచిన బుట్టల్లో ఎలుకలు తిరుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బుధవారం రాత్రి భక్తులు ఈ దృశ్యాలను గమనించి సెల్‌ఫోన్లలో చిత్రీకరించడంతో సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. విషయం ఈవో త్రినాథరావు దృష్టికి వెళ్లడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది త్రిమూర్తులు, భద్రతా సిబ్బంది రాజును తాత్కాలికంగా విధుల నుంచి తప్పిస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్