ఇరుముడి జోష్‌లో రవితేజ.. నెక్స్ట్ మూవీకి క్రేజీ టైటిల్?

61చూసినవారు
ఇరుముడి జోష్‌లో రవితేజ.. నెక్స్ట్ మూవీకి క్రేజీ టైటిల్?
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా తెరకెక్కనుంది. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘తులాభారం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే దసరాకు పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్