ప్రముఖ నిర్మాత RB చౌదరి మృతి సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన TVK చీఫ్ విజయ్ తో కలిసి 'తిరుపాచి', 'జిల్లా' వంటి సూపర్హిట్ చిత్రాలు నిర్మించారు. నిన్న విజయ్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, 'తిరుపాచి' షూటింగ్ సమయంలో విజయ్ చౌదరిని సన్మానిస్తున్న ఫోటోను సూపర్ గుడ్ ఫిల్మ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతలోనే ఆయన మరణించడంతో విజయ్ అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.