భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్ల స్థానంలో పాలిమర్ నోట్లను వచ్చే ఏడాదిలో చలామణిలోకి తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తోంది. పాలిమర్ షీట్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన ఆర్బీఐ, జాతీయ భద్రత దృష్ట్యా పాకిస్తాన్, చైనాతో సంబంధం ఉన్న కంపెనీలను నిషేధించింది. ఆగస్టు 18న టెండర్ల ప్రక్రియ ముగియగా, యూకే,
ఆస్ట్రేలియా, వియత్నాంకు చెందిన కంపెనీలు పాల్గొన్నాయి. నమూనాల పరీక్షల అనంతరం తుది ఎంపిక జరుగుతుంది. తొలుత రూ.10, రూ.20 నోట్లను ప్లాస్టిక్‌లో ప్రవేశపెట్టనుంది.