RBI కొత్త రూల్.. రూ. 10వేలు దాటితే ఆన్‌లైన్ పేమెంట్ గంట లేట్?

41చూసినవారు
RBI కొత్త రూల్.. రూ. 10వేలు దాటితే ఆన్‌లైన్ పేమెంట్ గంట లేట్?
ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు RBI కీలక ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. వీటి ప్రకారం రూ.10 వేలకుపైగా జరిగే కొన్ని డిజిటల్ లావాదేవీలకు ఒక గంట ‘కూలింగ్ పీరియడ్’ అమలు చేసే అవకాశం ఉంది. దీంతో డబ్బు వెంటనే గ్రహీత ఖాతాలో జమ కాకుండా కొంత సమయం పడుతుంది. ఈలోపు మోసపోయినట్లు గుర్తిస్తే ట్రాన్సాక్షన్‌ను రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. వృద్ధులు, వికలాంగులకు అదనపు భద్రతా చర్యలు, ‘యూనివర్సల్ కిల్ స్విచ్’ వంటి సదుపాయాలను కూడా ప్రతిపాదించారు. అయితే ఇవి ప్రస్తుతం కేవలం ప్రతిపాదనలు మాత్రమే. ప్రజలు, బ్యాంకుల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే ఆర్‌బీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్